TG: ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న సంపత్ కుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం తొలగించింది. ఇసుక మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి అక్రమంగా కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుల్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ స్థానంలో ఇటీవల నియమితులైన బీఎం సందీప్‌ను కూడా అధిష్టానం తొలగించింది. పార్టీ తాజాగా 81 మందితో కొత్త కార్యదర్శుల జాబితాను విడుదల చేయగా, తెలంగాణ నుంచి అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సతీష్‌కు అవకాశం కల్పించింది. జెట్టి కుసుమ్ కుమార్ పదవిని మాత్రం కొనసాగించారు.