శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఏప్రిల్ 3 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి స్పందనతో పాటు డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. నిజాయితీ గల పంచాయితీ సెక్రటరీ శ్రీరామ్ (శివాజీ) కుటుంబం చుట్టూ తిరిగే కథలో, స్థానిక ఎస్సై విక్రమ్ (ప్రిన్స్) హత్యకు గురవ్వడంతో కథనం మలుపు తిరుగుతుంది.