శాంసంగ్ ఫోన్ల ధరలు భారీగా పెంపు

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్26 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలను 17 శాతం వరకు పెంచింది. జనవరిలో రూ.87,999తో విడుదలైన ఎస్26 (256జీబీ) బేసిక్‌ వేరియంట్‌ ధర తాజాగా రూ.1,02,999కి చేరింది. దీంతో సిరీస్‌లోని అన్ని మోడళ్ల ధరలు రూ.లక్ష మార్కును దాటాయి. 1టీబీ స్టోరేజ్‌ కలిగిన ఎస్26 అల్ట్రా ధర రూ.2,14,999కి పెరిగింది. మెమొరీ చిప్‌లు, మదర్‌బోర్డులు, ఇతర కీలక ఎలక్ట్రానిక్‌ విడిభాగాల ధరలు పెరగడంతో ఈ సవరణ చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕