ఇసుక ట్రాక్టర్ బీభత్సం.. సైక్లిస్ట్ మృతి, రెండు కార్లు ధ్వంసం!

యూపీలోని కాస్‌గంజ్ జిల్లాలో ఒక ఇసుక ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. భారీ వేగంతో నియంత్రణ కోల్పోయిన ట్రాక్టర్, రోడ్డుపై వెళ్తున్న సైక్లిస్ట్‌ను తొక్కేసింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై ట్రాక్టర్ వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఆగి ఉన్న మారుతీ సుజుకి స్విఫ్ట్ డిజైర్, ఈకో కార్లను బలంగా ఢీకొట్టడంతో కార్లు దెబ్బతిన్నాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్