TG: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 29కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్ విధానంలో కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే మిగిలిన నిందితులు కోర్టుకు హాజరుకాకపోవడంతో తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.