HYD-సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్లాల్సి వస్తే ఖర్చు తానే భరిస్తానని వైద్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, డిసెంబర్ 4న గాయపడ్డ శ్రీతేజ్.. 2 నెలలు దగ్గర పడుతున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ట్యూబ్ ద్వారానే లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నాడు.