రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన దరఖాస్తుదారులకు 165 రేషన్ కార్డులు మంజూరైనట్లు తహశీల్దార్ ఆశాజ్యోతి తెలిపారు. 335 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 165 రేషన్ కార్డులు మంజూరైనట్లు చెప్పారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. 250 మంది పేర్లు కొత్తగా చేర్చినట్లు పేర్కొన్నారు.