హైదరాబాద్ లో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అభివృద్ధికి ప్రభుత్వం 57.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో ఆధునిక అకాడమిక్ భవనాలు, బాలురు, బాలికల హాస్టల్, గెస్ట్ హౌస్ సదుపాయాలు, శాశ్వత క్యాంపస్ అభివృద్ధి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.