సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఆందోల్ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో విద్య వైద్య రంగాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.