సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం చివరి రోజున కోలాహలంగా కొనసాగింది. బిజెపి పార్టీ అభ్యర్థులు భాజాభజంత్రీలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మున్సిపల్ కార్యాలయం సందడిగా మారింది.