అందోలు మండలం మన్సాన్పల్లికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని లాస్య ప్రియ రచయిత్రిగా గుర్తింపు పొందింది. ఆమె రచించిన “ది జర్నీ ఆఫ్ జాయ్” పుస్తకానికి ప్రముఖ ప్రచురణ సంస్థ బ్రిబుక్స్ నిర్వహించిన సమ్మర్ బుక్ రైటింగ్ ఫెస్టివల్ -2026లో హానర్ రోల్ సర్టిఫికేట్ లభించింది. చిన్న వయసులోనే ప్రతిభ చాటిన లాస్య ప్రియకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.