కుసంగి గ్రామ పంచాయతీలో, ప్రధాన ఎన్నికల సంఘం SIR ఆధ్వర్యంలో ఓటరు సర్వే ప్రక్రియపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, BLOలు, BLAలు ప్రజలకు ఓటరు సర్వే ఫారం నింపే విధానాన్ని వివరించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వేను పూర్తిచేయాలని, అందరూ భాగస్వాములై సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అసిస్టెంట్ ఉదయ్, గ్రామ ఉప సర్పంచ్ సుబ్బారావు, మాజీ సర్పంచ్ మొగుల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.