టేక్మాల్‌లో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను సోమవారం జిల్లా లేబర్ సెల్ కన్వీనర్ నాయికోటి శామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను, పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. టేక్మాల్ మండల బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సేనాపతి మాట్లాడుతూ, భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చూపిన ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕