సైబర్ మోసాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డిఎస్పి వేణుగోపాల్ రెడ్డి సూచించారు. సుల్తాన్ పూర్ లోని జేఎన్టీయూ కళాశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోవాలని, ఓటిపి నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. ఈ సమావేశం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో జరిగింది.