సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభా యాత్ర కార్యక్రమం ఆట పాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం గణపతి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయి బ్రాహ్మణ మండల సంఘం అధ్యక్షులు బోనోల్ల గంగారం, యాదగిరి, రామకృష్ణ, కాశీ, నగేష్, ఈశ్వర్, నరేష్, శీను, బాలు, పాండు, పెంటయ్య, తుల్జారాం, కిషన్ తదితరులు పాల్గొన్నారు.