బుధవారం మునిపల్లి టోల్ ప్లాజా వద్ద గోవా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆత్మరామ్ ట్రావెల్స్ బస్సులో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి అబ్దుల్లా అనే వ్యక్తి వద్ద నుంచి 8.6 గ్రాముల కోకైన్, 8.5 గ్రాముల చెరస్, 0.4 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 2,01,000 ఉంటుందని అధికారులు తెలిపారు. అబ్దుల్లాను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.