ఆదివారం నాడు ఆందోలు మండలం గడి పెద్దాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.