జోగిపేటలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రి దామోదర రాజనర్సింహ బీసీలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంచార్జి నరహరి రెడ్డి కూడా పాల్గొన్నారు.