సేవా సంకల్ప అభియాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా అంగన్ క సేవ అనే కార్యక్రమంలో భాగంగా శనివారం కోర్పోలు గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడి కేంద్రాలను గ్రామ బిజెపి నాయకులు పరిశీలించారు. వాటిలో ఉన్న చిన్నారులతో ముచ్చటించి, మిఠాయిలు పంచుకొని, ఒకటి నుంచి వెయ్యి రోజుల వరకు ఒక శిశువు ఎదుగుదలలో ఎంతో తోడ్పడుతూ వారికి సేవలు చేస్తున్న ఆయాలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న అంగన్వాడి టీచర్లకు వారి సేవలను కొనియాడుతూ వారిని శాలువాలతో సత్కరించారు.