హెల్త్ కార్డు కోసం ఉపాధ్యాయుల వేతనాల నుంచి 50% కోత విధించడాన్ని నిరసిస్తూ టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్ మాట్లాడుతూ, సరైన విధివిధానాలు రూపొందించకుండా ఈ హెచ్ఎస్ పేరుతో కోత విధించడం సరికాదని అన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.