జోగిపేట పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి క్లాక్ టవర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ, సర్దార్ పటేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఈ ర్యాలీ దేశ సమైక్యతను చాటింది.