గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లి గ్రామంలో జైశ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా నిర్వహించిన ఈ యొక్క పూజా కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు మర్పల్లి గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి నర్సింలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి సహకరించిన నాయకులకు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕