ముద్దాయిపేటలో ఘనంగా గణేశ్ నిమజ్జనం

సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం ముద్దాయిపేటలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో 13 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర శనివారం రాత్రి ఘనంగా జరిగింది. మహిళలు కోలాట నృత్యాలతో అలరించారు. లడ్డు వేలం పాటలో మొదటి లడ్డును కొడకంటి మల్లేశం 48 వేలకు, రెండో లడ్డును గొల్ల గోపాల్ 28 వేలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕