ఆందోలు నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, నర్సింగ్ విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కళాశాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పనులను త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.