కూకట్‌పల్లి: నిమ్స్‌ లో బాధితులను పరామర్శించిన మంత్రి

కూకట్‌పల్లి – కల్తీ కళ్లు బాధితులను నిమ్స్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. 31 మంది నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. అందరూ స్టేబుల్‌గా ఉన్నారన్నారు. ఒక నలుగురికి డయాలసిస్ చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్