మునిపల్లి: కంకోల్ టోల్ ప్లాజా వద్ద ప్రమాదం

కంకోల్ టోల్ ప్లాజా వద్ద 65వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కోళ్ల బొలెరోను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో మధు(21), నాని(22)కి తీవ్ర గాయాలయ్యాయి. టోల్ ప్లాజా అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్