మునిపల్లి: 'కనీసం 100 మందికి పని కల్పించాలి'

మునిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో అంజయ్య, ఏపీవో యాదగిరి మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో రోజుకు కనీసం 100 మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా చూడాలని సూచించారు. కూలీల సమీకరణలో మేట్లు చొరవ తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీవో ఆండాలమ్మ, టీఏలు, ఎఫ్ఎలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్