ఆదివారం, మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామం వద్ద సింగూర్ బ్యాక్ వాటర్ పై రూ. 17. 70 కోట్ల నిధులతో నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన పనులను మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే గార్లపల్లి గ్రామం నుండి మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరం తగ్గి ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.