పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలోని వరసిద్ధి వినాయక ఆలయంలో సోమవారం సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అర్చకులు వేదమంత్రాలతో గణపతి హోమం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.