పటాన్ చెరు: గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు

పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలోని వరసిద్ధి వినాయక ఆలయంలో గురువారం సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు గణపతికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం కూడా జరిగింది. భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడానికి 108 ప్రదక్షిణలు చేశారు.

సంబంధిత పోస్ట్