గో రక్షణ చట్టం అమలు చేయాలని, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలోని స్వామి వివేకానంద విగ్రహం ముందు నిరసన కార్యక్రమం జరిగింది. సంఘం నాయకులు గో రక్షణ చట్టం అమలు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.