పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చిన్నారులకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ నెల 29, 30 తేదీల్లో కూడా ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.