ఆందోలు: గెలిచిన ఓడిన ప్రజల వెంటే మంత్రి దామోదర్

తాను గెలిచిన ఓడిన ఆందోలు ప్రజల వెంటే ఉంటారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా జోగిపేటలో శుక్రవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తొలి ఆంధ్ర మహాసభ జోగిపేటలో జరిగిందని.. ఇప్పుడు జనహిత పాదయాత్ర కూడా జోగిపేటలోనే నిర్వహించినట్లు చెప్పారు. ఇక్కడి ప్రజలు ఎప్పటికీ కాంగ్రెస్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్