రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేవలం సమీక్షలకే పరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా సింగూరు డ్యాం నుంచి నీటిని ఖాళీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగూరు డ్యాం మరమ్మతులకు కేటాయించిన నిధుల వివరాలను ప్రకటించాలని, ఇరిగేషన్ అధికారులు సమీక్షలపై పూర్తిస్థాయి నివేదికలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.