ఓపెన్ స్కూల్ విధానంలో 10 ఇంటర్ ప్రవేశానికి శుక్రవారం చివరి తేదీ అని జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ ఫీజు మీసేవ ఆన్ లైన్ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని చెప్పారు. సమీపంలోని అధ్యయన కేంద్రాలను సంప్రదించి అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.