వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు పక్కా గెలుస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ధీమా వ్యక్తం చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా జోగిపేటలో శుక్రవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 42 శాతం బీసీల రిజర్వేషన్లు పక్కా అమలు చేస్తామని చెప్పారు. ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పై చూపుతున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేము అని పేర్కొన్నారు.