పుల్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రపంచ దివ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చందా శ్రీధర్ విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, వారికి వాసవి క్లబ్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.