సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం, టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం కార్యదర్శి, గ్రామ సర్పంచ్ తలారి అవినాష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి, "పల్స్ పోలియో – నిండు ప్రాణానికి రెండు చుక్కలు" అనే నినాదాన్ని గుర్తుంచుకుని, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో అందరి భాగస్వామ్యం కీలకమని తెలిపారు.