రామచంద్రపురం మండలం కొల్లూరు టు బి హెచ్ కె లో ప్రారంభించిన పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల చదువుతున్న తీరును, పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.