ప్రకృతి వనంలో పిచ్చి మొక్కల తొలగింపు

ఆదాయ పన్ను శాఖ కమిషనర్ ఐఆర్ఎస్ సుధాకర్ నాయక్ ఆదేశాల మేరకు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం బొమ్మరెడ్డిగూడెంలో ఆదివారం 6వ వారం శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పల్లె ప్రకృతి వనంలో గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులు పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో పాండు, శివాజీ, నరేందర్, విగేష్, ప్రకాష్, రూప్లమల్లేష్, రాములు, ప్రభు, అభిలాష్, సంతోష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రకృతి వనాన్ని శుభ్రంగా ఉంచారు.

సంబంధిత పోస్ట్