సంగారెడ్డిలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత తెలిపారు. ఈ కళాశాలలో బీఎస్సీ, బీజెడ్సీ, ఎమ్మెస్డీఎస్, ఎమ్మెస్సీ, బీకాం కంప్యూటర్, బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులు. పూర్తి వివరాల కోసం 7702790377 నంబర్‌లో సంప్రదించవచ్చు.