సంగారెడ్డి: ఆ తండాలో ఒకే కుటుంబంలా హోలీ సంబరం

సదాశివపేట మండలంలోని సర్దార్ తండాలో సోమవారం సాయంత్రం గ్రామస్థులంతా అత్యంత ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. గ్రామపెద్దలు, సర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో శాస్త్రోక్తంగా కామదహనం నిర్వహించారు. తండావాసులు కులమతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి, ఒకే కుటుంబంలా రంగులు పూసుకుంటూ వేడుకను విజయవంతం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాగే ఐకమత్యంతో పండుగలు జరుపుకుంటామని గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్