సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ లోని గ్రామ దేవత ఉరడమ్మకు ఆషాఢమాసంను పురస్కరించుకుని ఆదివారం గ్రామస్తులు బోనాల మహోత్సవంను వైభవంగా నిర్వహించడం జరిగింది. ముందుగా గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో వాగుకు వెళ్లి గంగమ్మ తల్లికి పూజాకార్యక్రమాలు నిర్వహించి నైవేద్యం పెట్టి ఆ నీటిలో తెప్పేను విడిచి, నిండు కుండలో జలాన్ని తెచ్చి అమ్మవారికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజాకార్యక్రమాలు గావించి, ఘటంను సమర్పించారు.