చౌటకూర్ మండలం శివంపేటలోని మంజీరా నదిలో సరస్వతి దేవి స్నపన మహోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీ జ్యోతిరు వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో అమ్మవారికి మాంజీరా నదిలో ప్రత్యేక కార్యక్రమాలను జరిపించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేశారు. కార్యక్రమ విశిష్టతను భక్తులకు సిద్ధాంతి వివరించారు.