సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం 'స్పార్క్' సమావేశం జరిగింది. పోలీసు శాఖ ఉద్యోగుల పిల్లలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 'స్పార్క్' పేరుతో సహకారం అందిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆయన సూచించారు. స్పార్కు కార్యక్రమంపై అవగాహన కల్పించారు.