చౌటకూరులో ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర, కళ్యాణం అంగరంగ వైభవంగా

సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల బంధువులు, పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ జాతర అందోల్ నియోజకవర్గంలో నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్