సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ పలువురు సంఘం నాయకులు అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం సమర్పించారు. సంఘం నాయకుడు అఖిల్ మాట్లాడుతూ, ప్రభుత్వ బడుల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలను పరిష్కరించి పాఠశాలలను బలోపేతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రఘు, సాయి పాల్గొన్నారు.