వట్టిపల్లి మండలం సహేదానగర్ గ్రామంలో రీ సర్వే పైలట్ ప్రాజెక్టును కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పటం లేకపోవడం వల్ల మళ్లీ ఈ సర్వే చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటివి ఐదు గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసిందని చెప్పారు. రీసర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పాండు పాల్గొన్నారు.