ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ఈ సభల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వాములు చేయాలని ఆయన సూచించారు.