సంగారెడ్డిలో ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో బుధవారం దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు తమ సమస్యలను జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ లలితా కుమారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం దివ్యాంగులను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల వర్కింగ్ ప్రెసిడెంట్ మన్నే పోచయ్యతో పాటు జిల్లా నలుమూలల నుంచి వికలాంగులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్